తమ్ముడిని నామినేట్ చేసిన అన్నయ్య చిరు !

Published on Jul 31, 2018 4:31 pm IST

మొన్నదటిదాకా ఫిట్ నెస్ ఛాలెంజ్ ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ అనే చాలేంజ్ లో పాల్గొన్న సినీ ప్రముఖలు ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరిత హారం’ లో భాగస్వామ్యులవుతున్నారు. దాంట్లో భాగాంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పెరట్లో ఈ రోజు కొన్ని మొక్కలను నాటి ఈ గ్రీన్ చాలేంజ్ లో పాల్గొన్నారు. ఆ తరువాత తన అభిమానులకు వీడియో ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు.

అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో పాటుగా తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను చిరు ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఇక ఇంతకుముందు కింగ్ నాగార్జున , సూపర్ స్టార్ మహేష్ బాబు లు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటారు. ఇలా ఒక మంచి కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :