‘ఆచార్య’లో సంగీత పాత్ర అదే !

‘ఆచార్య’లో సంగీత పాత్ర అదే !

Published on Jun 20, 2021 10:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో మాజీ హీరోయిన్ సంగీత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె నర్తకి పాత్రలో నటిస్తోందట. ఇక సంగీత పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. ఇంటర్వెల్ లో ఆమె పాత్ర చనిపోతుందని.. ఈ సీక్వెన్స్ లోనే చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొరటాల రాసిన కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుందట. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు