కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్ !

కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్ !

Published on Nov 25, 2018 5:22 PM IST

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్‌ మృతితో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన అంబరీష్ మృతిపట్ల తెలుగు తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా అంబరీష్ మరణ వార్త గురించి తెలిసిన వెంటనే.. షాక్ అయిన మెగాస్టార్ హుటాహుటిన బెంగుళూరు వెళ్లి అంబరీష్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ అంబరీష్ తో తనకున్న స్నేహాన్ని చిరంజీవి గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అంబరీష్ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు