‘మెగాస్టార్’ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే – అమీర్ ఖాన్

Published on Apr 7, 2019 3:53 pm IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకి ఈ అరుదైన కలయిక అనుకోకుండా జరిగిందట. క్యోటో విమానాశ్రయంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిశారు. ఇటీవలే మెగాస్టార్ విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. అలాగే అమీర్ కూడా తన కుటుంబంతో సేదతీరడానికి జపాన్ వెళ్ళాడు. కాగా ఈ పర్యటనలోనే మెగాస్టార్, అమీర్ ఖాన్ అనుకోకుండా తారసపడ్డారు.

అయితే మెగాస్టార్ ని కలిసిన విషయాన్ని అమీర్ తన ట్విట్టర్ వేదికగా తెలుపుతూ.. ‘నా అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ చీరంజీవిగారు, నేను క్యోటో విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్నాం. ఆయన, నాకు ‘స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం ‘ సైరా నర్సింహారెడ్డి’ గురించి చెప్పారు. ఆయనెప్పుడూ మాకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’ అని అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :