లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన ఉగాది చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం మెగా అభిమానుల్లో స్పెషల్ గా మారింది. ఇక ఈ ఈ స్క్రీనింగ్ లో మెగాస్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ ని బాగా ఎంజాయ్ చేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
చిరంజీవి సహా పవన్ కళ్యాణ్ ఇతర కుటుంబీకులు చిత్ర యూనిట్, నిర్మాతలు అలాగే హీరోయిన్ శ్రీలీల అంతా ఈ స్క్రీనింగ్ లో పాల్గొంది ఉస్తాద్ భగత్ సింగ్ ని ఎంజాయ్ చేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. మరి ఇందులో చిరు హిట్ సాంగ్ వాన వాన వెల్లువాయి సాంగ్ కి పవన్ స్టెప్పులు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. దానిని మెగాస్టార్ మరింత ఎంజాయ్ చేసినట్టుగా మైత్రి మేకర్స్ వదిలిన వీడియోలో చూస్తే అర్ధం అవుతుంది. ఇలా మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ని మెగాస్టార్ అండ్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసారని చెప్పొచ్చు.
