గణేష్ పాత్రో మరణంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi
మునుపటితరం రచయిత గణేష్ పాత్రో మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రచనా రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గణేష్ ‘మరోచరిత్ర’, ‘సీతారామయ్యరావుగారి మనవరాలు’, ‘రుద్రవీణ’ ఇటీవల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు పనిచేశారు.

ఈయన మరణానంతరం మెగాస్టార్ చిరంజీవి గణేష్ పాత్రో గారితో వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “క్యాన్సర్ కారణంగా మరొక సినిమా ప్రముఖుడు మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. గణేష్ పాత్రో గొప్ప రచయిత. ఆయన నా రుద్రవీణ సినిమాకు రాసిన సంబాషణలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయని” తెలిపారు

Exit mobile version