పవన్ లో అదే వాడి అదే వేడి..”వకీల్ సాబ్” చూసాక చిరు!

Published on Apr 10, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నిన్న విడుదలతో ఎలాంటి రెస్పాన్స్ ను ఆలోవర్ గా అందుకుందో తెలిసిందే. మూడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పవన్ ఫ్యాన్స్ ఎలా కోరుకున్నారో అదే విధంగా అంతకు మించిన కంటెంట్ తో దర్శకుడు శ్రీరామ్ వేణు సూపర్బ్ ఫీస్ట్ ను ఇచ్చారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూస్తానని పవన్ బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు గానే వారి మాతృమూర్తి అంజనాదేవి గారితో సహా వెళ్లి “వకీల్ సాబ్” సినిమాను వీక్షించారు.

మరి ఇదిలా ఉండగా చిరు ఈ సినిమా చూసాక తన రియాక్షన్ ను పంచుకున్నారు. ముందుగా తమ్ముడు పవన్ కోసం మాట్లాడుతూ మూడేళ్లు అయినా కూడా పవన్ లో అదే వేడి అదే వాడి కనిపించాయని ప్రకాష్ రాజ్ తో కోర్ట్ డ్రామా అయితే అద్భుతం అని కొనియాడారు. మరి అలాగే కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు నటీమణులు నివేతా థామస్ మరియు అనన్య నాగళ్ళ, అంజలిలు వారి పాత్రల్లో జీవించారని..

దిల్ రాజు మరియు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సహా సంగీత దర్శకుడు థమన్ వినోద్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోశాయని చిరు తెలిపి ఎంటైర్ టీం కు తన కంగ్రాట్స్ తెలిపారు. అలాగే అన్నిటికీ మించి ఈ చిత్రం మహిళలకు ఇవ్వలిన గౌరవాన్ని తెలియజేసే అత్యవసర చిత్రం అని తెలిపారు. ఫైనల్ గా ఈ వకీల్ సాబ్ కేసులనే కాకుండా అందరి మనసులు గెలుస్తాడని తెలిపారు.

సంబంధిత సమాచారం :