తాడేపల్లిగూడెంలో చిరంజీవి ఘన స్వాగతం

తాడేపల్లిగూడెంలో చిరంజీవి ఘన స్వాగతం

Published on Oct 6, 2019 7:58 PM IST

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విఖ్యాత ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తాడేపల్లి గూడెంలో అట్టహాసంగా జరిగింది. వేలాదిగా మెగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి ఘనంగా స్వాగతం పలికారు.

సుమారు 300లకు పైగా కార్లలో తాడేపల్లిగూడెంకు ర్యాలీగా బయలుదేరిన చిరంజీవి ఏలూరు మీదుగా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి ఎస్వీ రంగారావు గారి అద్భుత నటనను ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తాను సినీ పరిశ్రమకు రావడానికి స్ఫూర్తినిచ్చిన నటులలో ఎస్వీ రంగారావు ఒకరని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమం కొద్దిరోజుల ముందే జరగాల్సివుండగా కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతూవస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఎస్వీ రంగారావు పేరిట ఓ ఓ ఫిల్మ్ కాలేజ్ స్థాపించనున్నట్లు చెప్పడం విశేషం.

తాజా వార్తలు