సాహసానికి మరో పేరు..కృష్ణ గారికి మెగాస్టార్ విషెష్.!

Published on May 31, 2021 1:00 pm IST

నేడు మన టాలీవుడ్ ఫస్ట్ ఎవర్ హాలీవుడ్ హీరో నటశేఖర కృష్ణ గురై జన్మదినం కావడంతో ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ నుంచి సహా అనేక మంది అగ్ర సినీ తారలు వరకు తమ గ్రాండ్ విషెష్ ను తెలియజేస్తూ వస్తున్నారు. మరి అలా ఈ టాలీవుడ్ లెజెండరీ హీరోకి మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలి శుభాకాంక్షలు తెలియజేసారు.

“సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ తన గౌరవాన్ని చిరు వ్యక్తపరిచారు.

దీనితో ఇరువురి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :