మెగాస్టార్ ‘లూసిఫర్’ ఆలస్యం కానుందా ?

Published on Nov 30, 2020 12:00 am IST

మెగాస్టార్ చిరంజీవి వినాయక్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ సంతృప్తి చెందలేదని.. అందుకే మెహర్ రమేష్ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారని.. దాంతో
‘లూసిఫర్’ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేయనున్నారట ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది.

అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా పూర్తయిన తరువాత ముందుగా తమిళ ‘వేదాళం’ రీమేక్ ను మొదలుపెడతారు. ఇక ఈ సినిమాను ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More