మెగాస్టార్ సినిమా షూట్ పై కూడా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..!

Published on Jun 29, 2021 8:03 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే బిగ్ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే రానున్న రోజుల్లో ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ కూడా ముగియనుంది.. అయితే ఈ చిత్రం అనంతరం మెగాస్టార్ రెండు రీమేక్స్ చేయనున్నారు.

మరి వాటిలో లూసిఫర్ రీమేక్ కి అయితే నిన్ననే మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యిపోయాయని సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు. మరి దీనిపై దర్శకుడు మోహన్ రాజా కూడా స్పందిస్తూ థమన్ సూపర్ సాంగ్స్ ఇస్తున్నాడని అలాగే ఈ సినిమాపై ఎగ్జైటింగ్ గా కూడా ఉన్నానని తెలిపారు..

మరి అలాగే షూటింగ్ కూడా అతి త్వరలోనే ఉంటుంది అని మరో క్లారిటీ ఇచ్చారు. అంటే ఆచార్య అయ్యాక పెద్దగా ఆలస్యం చెయ్యకుండానే మెగాస్టార్ ఈ సినిమా కూడా స్టార్ట్ చేసేస్తారని చెప్పాలి..ఇక ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు మరియు ఎన్ వి ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :