మోడీగారు అలా అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది – మెగాస్టార్ చిరంజీవి

మోడీగారు అలా అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది – మెగాస్టార్ చిరంజీవి

Published on Jun 12, 2024 11:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం కి ముఖ్యఅతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు అయ్యారు. ఈ వేడుక లో ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ లతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఈ విషయం పట్ల మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది.

“ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి’ అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు.

తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం” అని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు