నిజానికి చెల్లెళ్ల ప్రేమే అన్నయ్యకి శ్రీరామ రక్ష – మెగాస్టార్ చిరంజీవి

Published on Aug 22, 2021 10:01 pm IST

నేడు రక్షా బంధన్ సందర్భంగా అన్నా చెల్లెలి అనుబందాల పై ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే తరహా లో మెగాస్టార్ చిరంజీవి నేడు రక్షా బంధన్ సందర్భంగా అభిమానులకు, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి చెల్లెళ్ల ప్రేమే అన్నయ్యకు శ్రీరామ రక్ష అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. హ్యాపీ రక్షా బంధన్ టూ ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటూ చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి తన సోదరి లతో రాఖీ పండుగ జరుపుకున్న వీడియో ను ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కూడా కావడం తో పలు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :