టీజర్ ఏమో కానీ..బాస్ దెబ్బ గట్టిగా వైరల్ అయ్యింది..!

Published on Jan 27, 2021 7:08 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ సినిమా కి సంబంధించే మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రావాల్సిన టీజర్ రాకపోవడంతో నిరాశ తప్పలేదు. అప్పుడు మెగాస్టార్ తనదైన శైలిలో ఈ సిచుయేషన్ హ్యాండిల్ చేశారు. ఏకంగా కొరటాలతో టీజర్ కోసం డిస్కస్ చేస్తున్నట్టుగా ఓ ఫన్నీ మీమ్ ను తయారు చేసి వేసేసారు. దీనితో బాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ముందే చిరు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఆ టైప్ లో ట్రెండీ మీమ్ వేసే సరికి టీజర్ కోసం కన్నా చిరు వేసిన ఈ మీమ్ కోసమే గట్టిగా వైరల్ అయ్యింది. మొత్తానికి మాత్రం బాస్ నేటి తరానకి కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను ఓ రేంజ్ లో అందిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More