మెగాస్టారే ముందు స్టార్ట్ చేయనున్నారా.?

Published on Jun 3, 2021 7:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఒక్క మెగాస్టార్ నటిస్తున్నారని కాకుండా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండడంతో మల్టీ స్టారర్ లెవెల్ తెచ్చుకుని మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంది.

అయితే ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే షూట్ బ్యాలన్స్ ఉంచుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే మళ్ళీ రీస్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా కరోనా సెకండ్ వేవ్ మూలాన అన్ని సినిమాల షూటింగులు నిలిపివేశారు. మరి ఇప్పుడు పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ప్రస్తుత భారీ చిత్రాల్లో మెగాస్టార్ నే ముందు షూట్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :