మెగాస్టార్ 10 లక్షలు విరాళం !

Published on Apr 18, 2019 4:00 am IST

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కాంచన 3′. కాగా ఏప్రిల్ 19వ తేదీన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం జరిపింది.

ఈ ఈవెంట్ లో వీడియో ద్వారా మాట్లాడిన మెగాస్టార్, రాఘవ లారెన్స్ చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. లారెన్స్ అంచలంచెలుగా స్వయంకృషి తో ఎదగటం, ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే గర్వంగా ఉంది. ఎందరో చిన్నపిల్లల బాగోగులు చూస్తున్న తన ట్రస్ట్ హైదరాబాద్ లో కూడా ప్రారంభిస్తున్న సందర్భంగా నా వంతుగా 10 లక్షలు విరాళం అందిస్తున్నాను.’ అని ప్రకటించారు.

ఇక ఇటీవల విడుదలైన కాంచన 3 చిత్రం ట్రైలర్ సినిమా ఫై అంచనాలను పెంచింది. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :