ఫోటో మూమెంట్ : మనవరాలితో మొదటి వినాయక చవితిలో మెగాస్టార్

Published on Sep 18, 2023 2:00 pm IST

ఈ ఏడాది మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే తన వారసుడు గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోడలు ఉపాసన ఇంట మెగా వారసురాలి రాకతో అయితే ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయ్యింది. మరి తాము ఆమెకి క్లిన్ కారా అనే పేరు కూడా పెట్టి శుభవార్తను పంచుకున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రత్యేకదినం వినాయక చవితికి అయితే చిరు కొన్ని బ్యూటిఫుల్ స్నాప్ లు షేర్ చేశారు. తాను రామ్ చరణ్ ఉపాసన సహా తన భార్య అంతా కూడా గణేశుని పూజ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మరి ఈ శుభ సందర్భంలో అయితే మెగాస్టార్ ఓ పోస్ట్ పెట్టారు.

“అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం” ఆనందంగా ఉంది అంటూ ఎమోజిస్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. దీనితో ఈ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :