‘అల్లుడు శీను’కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు..

‘అల్లుడు శీను’కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు..

Published on Jul 28, 2014 10:53 AM IST

chiru-vv-vinayak

మెగాస్టార్ చిరంజీవి & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘అల్లుడు శీను’ సినిమాను చూడడం జరిగింది. తర్వాత దర్శకుడు వినాయక్ కు ఫోన్ చేసి చిరంజీవి అభినందించారు. మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీశావంటూ ప్రశంసించారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు చిరు ఫోన్ చేసి అభినందించారు. సినిమా విజయవంతం అయినందుకు కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి నుండి ఫోన్ రావడంతో హీరో సంతోషంగా ఉన్నారు.

చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో చిరంజీవి వినాయక్ కు ఫోన్ చేసి ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజా వార్తలు