మెగాస్టార్ ‘సైరా’ క్లైమాక్స్ అదే !

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా శరవేగంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అయితే ఈ బయోపిక్ లో మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాటిక్ అంశాలు జోడిస్తున్నారు. కానీ క్లైమాక్స్ ను మాత్రం దర్శకనిర్మాతలు ఇప్పటివరకు ఫైనల్ చెయ్యలేదు. నరసింహారెడ్డి జీవితం ఆధారంగా క్లైమాక్స్ ను తీస్తే.. సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తోంది. అప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ పడతారని మెగాస్టార్ భావిస్తోన్నారట.

అందుకే నరసింహ రెడ్డి చావుతో కాకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తితో … మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉంటే బాగుటుందని అప్పట్లో ఒక వర్షన్ అనుకున్నారు. ఇప్పుడు దాన్నే తెరకెక్కించాలని తాజగా చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version