మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతోంది. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ ఫైటర్లతో ఈ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఐతే, వచ్చే వారం నుంచి ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ సాంగ్ లో చిరంజీవి స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని, ఈ లుక్ ను లాక్ చేశారని, కచ్చితంగా ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది.
పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
