స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మేఘా ఆకాష్

Published on Jun 25, 2019 4:03 pm IST

తెలుగులో ‘లై, ఛల్ మోహన్ రంగ’ వంటి సినిమాలు చేసిన మేఘా ఆకాష్ వాటిలో ఏవీ సక్సెస్ కాకపోవడంతో కొంచెం డీలా పడింది. కానీ కొద్దిగా గ్యాప్ తరవాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తమిళంలో ధనుష్, గౌతమ్ మీనన్ సినిమాలో హిందీలో ‘శాటిలైట్ శంకర్’ తెలుగులో ‘మను చరిత్ర’ సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. అతనే విజయ్ సేతుపతి.

ఈమధ్య సేతుపతి తన 33వ సినిమాను ఆరంభించారు. ముందుగా ఇందులో కథానాయకిగా అమలాపాల్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మేఘా ఆకాష్ అవకాశాన్ని దక్కిచుకుంది. ఈ సినిమా గనుక హిట్టయితే తమిళంలో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి. వెంకట కృష్ణ రొగంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More