“రాజ్ దూత్” ఫస్ట్ లుక్: రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన జూనియర్ రియల్ స్టార్

Published on Jun 1, 2019 4:15 pm IST

రియల్ హీరో శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంష్ శ్రీహరి హీరో గా పరిచయమవుతున్న మూవీ “రాజ్ దూత్”. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన లెదర్ జాకెట్, జీన్ ప్యాంటు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని రఫ్ లుక్ లో మేఘాంష్ మాస్ హీరోకి ఏమాత్రం తీసిపోడన్నట్లున్నాడు.
రోడ్డుపై రయ్యిన దూసుకుపోతు మధ్యలో ఆగి ఫోజిస్తున్న మేఘాంష్ ప్రయాణం ఎక్కడి వరకో? దేనికొరకో?, తెలియాలంటే మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ నిర్మిస్తున్నారు. “రాజ్ దూత్”అనే టైటిల్ మరి “ఆర్ ఎక్స్ 100” మూవీ స్పూర్తితో పెట్టారో లేక, హీరో ఈ మూవీలో ఓ మెసెంజర్ పాత్ర చేయడం వలన లాజికల్ గా ఈ టైటిల్ పెట్టారో సినిమా విడుదలైతే తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం :

More