ప్రస్తుతం ఓవర్సీస్లో తాజాగా విడుదలైన తెలుగు సినిమాలు ‘మహానటి, మెహబూబా’. వీటిలో ముందుగా రిలీజైన ‘మహానటి’ చిత్రం బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుని వీక్ డేస్ లో సైతం బలమైన వసూళ్లతో నడుస్తోంది. నిన్న శుక్రవారం రోజున 261,112 డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 930,180 డాలర్లను అందుకుని మిలియన్ డాలర్ క్లబ్ కు చేరువలో ఉంది.
ఇక పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘మెహబూబా’ నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్ల ద్వారా 81 లొకేషన్ల నుండి 41,923 డాలర్లను ఈ చిత్రం వసూలు చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు 14,873 డాలర్లతో మొత్తంగా కలిపి 58,688 డాలర్లను అందుకుంది. ఈ శని, ఆదివారాల్లో ఉండబోయే వసూళ్లను బట్టి ఏ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఎక్కువ కాలం నిలబడుతుందో తెలుస్తుంది.


