సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మెహబూబా’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మెహబూబా’ !

Published on May 3, 2018 10:36 PM IST

ఆకాష్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్నాయి. చిత్ర యూనిట్ కూడా మంచి స్థాయిలోనే ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలని కూడ ముగించుకుంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సందీప్ చౌత సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా సినిమాను మే 11న రిలీజ్ చేయనున్నారు. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా కనిపించనుంది.

తాజా వార్తలు