షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మెహబూబా’ !
Published on Feb 24, 2018 2:43 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో చేస్తున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రం యొక్క షూటింగ్ పార్ట్ నిన్నటితో విజయవంతంగా పూర్తైపోయింది. ఇప్పటికే ఆకాష్ పూరి తన వంతు డబ్బింగ్ కూడ మొదలుపెట్టాడు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కు కూడ మంచి స్పందన లభించింది.

1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాను ఈ వేసవికి భారీ ఎత్తున విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సందీప్ చౌత సంగీతాన్ని అందిస్తున్నారు. సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook