తమిళ సూపర్ స్టార్ మూవీలో ఆఫర్ దక్కించుకున్న మెహ్రీన్

Published on Jun 16, 2019 1:21 am IST

మెహ్రీన్ పిర్జా మరొక గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది. 2019 సంక్రాంతి మూవీగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ముల్టీస్టారర్ “ఎఫ్2″లో నటించిన ఈ భామ ప్రస్తుతం గోపీచంద్ “చాణక్య” లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మరో పెద్ద ఆఫర్ ఇప్పడు మెహ్రీన్ ఖాతాలోకి చేరింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు. ఆర్.ఐ దురై స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై టి.జి త్యాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. సత్యజ్యోతి ఫిలింస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబందించిన ట్వీట్ చేశారు. ఐతే ఈ మూవీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మెహ్రీన్ కి 2019 గోల్డెన్ ఇయర్ లా ఉంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నాని హీరో గా వచ్చిన “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” అనే హిట్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ ఆ తరువాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ‘ఎఫ్2’ మూవీ తో ఈ భామ మళ్లీ విజయం అందుకుంది.

సంబంధిత సమాచారం :

X
More