మెహ్రీన్ ను ప్రశ్నించిన అమెరికా అధికారులు !

మెహ్రీన్ ను ప్రశ్నించిన అమెరికా అధికారులు !

Published on Jun 17, 2018 10:31 AM IST

గత కొన్ని రోజులుగా యూఎస్లో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో తెలిసిన సంగతి.ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు కూడ. ఈ విషయాన్ని యూఎస్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అందుకే ఆమ్రేరికాకు వస్తున్న తెలుగు సినీ సెలబ్రిటీలను క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖహ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కు యూఎస్ అధికారుల ద్వారా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను కలవడానికి యూఎస్ వెళ్లిన మెహ్రీన్ అక్కడి నుండి స్నేహితులను కలవడానికి కెనడా వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా అక్కడి అధికారులు ఆమెను తెలుగు పరిశ్రమకు చెందిన హీరోయిన్ అని తెలుసుకుని ప్రశ్నించారట.

ఈ పరిణామంతో షాక్ కు గురైన తాను 30 నిముషాలపాటు వాళ్ళడిగిన అన్ని ప్రశ్నలకు సరైన జవాబిచ్చి అమెరికా వచ్చింది కుటుంబ సభ్యులను కలవడానికని వివరించానని, దాంతో అధికారులు ఎందుకు ప్రశ్నించింది తెలిపి ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణ చెప్పారని ప్రముఖ వార్తా పత్రికకు తెలిపారు. ఏది ఏమైనా ఇలా కొందరి మూలాన ఎలాంటి పొరపాట్లు చేయని ఇతర హీరోయిన్లు కూడ ఇబ్బందిపడటం విచారించదగిన విషయమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు