యూత్ కే కాదు పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ‘మేమ్ ఫేమస్’ – నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్

Published on May 20, 2023 11:03 pm IST

ఇటీవల రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తోన్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ మేమ్ ఫేమస్. అయితే ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దీనికి దర్శకత్వం వహించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఇంటర్వ్యూ లో సినిమా మేమ్ ఫేమస్ గురించి పలు విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్‌, ఓవర్సీస్‌ లో సరిగమ సినిమాస్‌ ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. వైజాగ్‌ లో అన్నపూర్ణ స్టూడియోస్‌ డిస్ట్రిబ్యూటర్‌ గా వ్యవహరిస్తోంది. గీతా ఆర్ట్స్‌తో పాటు మరికొందరు డిస్ట్రిబ్యూటర్‌ లకు మేము ఇటీవల ఈ చిత్రాన్ని ప్రదర్శించాము.

వారు కంటెంట్‌ తో పూర్తిగా సంతోషంగా కాంప్లిమెంట్ చేశారు. సెన్సార్ వారు అభినందనలు తెలిపారని అన్నారు. యూట్యూబ్‌ లో సుమంత్ ప్రభాస్‌ షార్ట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత అతనిని ఎంపిక చేశాము. అతనిలో స్పార్క్ కనిపించింది. తాను రాసిన కథతో ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. అనంతరం ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహించాల్సింది వచ్చింది. మొదట్లో సుమంత్ పై విముఖంగా ఉన్నా, కథ చెప్పిన విధానం తీరు అతనిపై నమ్మకం పెరిగి మేము ముందుకు వెళ్లాం. మేమ్ ఫేమస్ సినిమా చాలావరకు కొత్త నటులతో తీసాము. మొత్తంగా చూస్తే దాదాపు 45 నుండి 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఈ సినిమా పరిచయం చేసాము. ఇది సరైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పగలం. అందుకే నటీనటుల ఎంపిక ప్రక్రియకు సమయం పట్టింది. కథ కంటే చెప్పే విధానం ముఖ్యం. స్క్రీన్ ప్లే బలంగా ఉంటుంది. కథగా చెప్పాలంటే పెళ్లి చూపులు, జాతి రత్నాలు కలిస్తే మేమ్ ఫేమస్ అవుతుంది. యూత్ కోసం సినిమా తీసిన ఫ్యామిలీలు చూసేలా మేమ్ ఫేమస్ ఉంటుంది.

రచయితగా, దర్శకుడుగా సుమంత్ ప్రభాస్ ఎలాంటి అనుభవం లేకున్నా అద్భుతంగా చేసారు. ఇది ముగ్గురు యువకుల కథ, వారి ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమా తెలుపుతుంది. ఈ సినిమా చూసినప్పుడు యువకులు చాలా వాటికి రిలేట్ అవుతారు. పెద్దలు సినిమా చూస్తే తమ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అనే విషయాలపై వారికి అవగాహన వస్తుంది. కళ్యాణ్ నాయక్ సంగీతం, బీజీఎమ్ అద్భుతంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ రోజా సినిమాతో లహరి మ్యూజిక్‌ లోకి అడుగుపెట్టింది. అలాంటిది ఈరోజు లహరి ఫిలిమ్స్ సంస్థ మేమ్ ఫేమస్ సినిమాని నిర్మించింది. మేమ్ ఫేమస్ ప్రమోషన్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, అడివి శేష్, హరీష్ శంకర్ ఉన్న ఆ వీడియోలు చాలా మంది ప్రేక్షకులకు చేరువయ్యాయి. ఈ సినిమా ట్రెండ్ గా నిలుస్తుంది అనే నమ్మకం ఉందని నిర్మాతలు ముగ్గురూ మాట్లాడుతూ చెప్పారు. కాగా ఈ మూవీ మే 26న గ్రాండ్ గా విడుదల కానున్న మేమ్ ఫేమస్ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :