విశాఖ తుఫాన్ బాధితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ చేపట్టిన ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్ స్టార్ నైట్ ఈవెంట్ వార్తలను గత రెండు వారాలుగా 123తెలుగు.కామ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. నవంబర్ 30వ తేదిన జరగబోయే ఈ కార్యక్రమం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో కళ్ళు చెదిరే రీతిలో ‘మేము సైతం’ స్టేజిని రూపొందించారని వేశారని సమాచారం. పైన చూపించిన ఫోటో మాదిరిగా ఆ స్టేజి సెట్ ఉండబోతుంది.
ఈ స్టార్ నైట్ ఈవెంట్ కార్యక్రమంలో దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు అందరూ పోల్గోననున్నారు. హిందీ పరిశ్రమ ప్రముఖులతో పాటు తమిళ పరిశ్రమ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు.
స్పెషల్ కామెడీ స్కిట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, స్టార్స్ తో లావిష్ డిన్నర్ తదితర కార్యక్రమాలను ఈ మెగా టెలిథాన్ కార్యక్రమం కోసం ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బులను తుఫాన్ భాదితుల సహాయార్ధం డొనేట్ చేయనున్నారు.


