‘మేరా భారత్ మహాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 23, 2019 10:30 am IST

ప్రముఖ నటీనటులు బాబు మోహన్, తనికెళ్ళ భరణి, ఆమని, గిరిబాబు, నారాయణ్ రావు, ఏల్.బి శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మేరా భారత్ మహాన్. భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీధర్ రాజు, డాక్టర్ తాళ్ళ రవి, డాక్టర్ టిపిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి యర్రం శెట్టి సాయి డైలాగ్స్ అందించగా లలిత్ సురేష్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :