మళ్లీ తెర పైకి ‘వెండితెర ఆరాధ్య దైవం’ !

Published on Sep 20, 2018 9:17 am IST

ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే విఠలాచార్య ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. అలాంటిది ఇప్పుడు చేతిలో అద్భుతమైన టెక్నాలజీ పెట్టుకొని.. ఇంకెంత చెయ్యొచ్చు. అందుకే భౌతికంగా అసలు లేని తమిళ ఆరాధ్య దైవం యంజీఆర్‌ ను మళ్లీ వెండితెర పైకి తీసుకురానున్నారు. తమ చిరకాల అభిమాన నటుణ్ణి మళ్లీ స్క్రీన్ పై చూసుకొనే అవకాశం రావడం పట్ల తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కాగా యంజీఆర్‌ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇప్పటికీ అక్కడకి గొప్ప ముఖ్యమంత్రిగా చిరస్థాయి ఖ్యాతిని సంపాదించుకున్నారు. అయితే ఆరెంజ్‌ కంట్రీ అనే ఓ మలేషియన్‌ కంపెనీ యంజీర్‌ ను తిరిగి వెండితేర పైకి తీసుకురానుంది. యన్‌ ఫేస్‌ టెక్నాలజీ సహాయంతో ఆయన్ని చాలా సహజంగా చూపించనుంది. ఈ చిత్రానికి పి.వాసుని దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :