తన స్టైల్ ఇంతే అంటున్న మిక్కీ

తన స్టైల్ ఇంతే అంటున్న మిక్కీ

Published on Apr 27, 2014 1:21 AM IST

Mickey-J-Meyer
హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం సినిమాలతో హిట్ సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్న మిక్కీ జె మేయర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరువాత అగ్ర స్థానానికి చేరువయ్యాడు. ఇప్పుడు మిక్కీ వరుణ్ తేజ్ మొదటి సినిమాకు సంగీతం అందించనున్నాడు

మంచి మెలోడియస్ ట్యూన్ లను కొట్టే మిక్కీ తాను మాటిమాటికీ అవే ట్యూన్ లను కొట్టానని చెప్పుకొచ్చాడు. వెస్ట్రన్ క్లాసిక్ సంగీతం మిమ్మల్ని ఎంతవరకూ ప్రభావితం చేస్తుంది అని అడగగా “వెస్ట్రన్ సంగీతం వింటుంటే మనకు వాళ్ళలో ఒక సిగ్నేచర్ స్టైల్ కనిపిస్తుంది. సౌండ్ ఒకేమాదిరి వున్నా ట్యూన్ లు మారుతూ వుంటాయి. నేను కూడా అదే పద్దతిని అనుసరిస్తాను” అని తెలిపాడు

ఇటీవలే మిక్కీ ప్రవీణ్ సత్తారు చందమామ కథలు సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రానున్న సినిమాకోసం కసరత్తు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు