రామ్ సినిమాకి సంగీతం అందివ్వనున్న మిక్కీ జె మేయర్ !

రామ్ సినిమాకి సంగీతం అందివ్వనున్న మిక్కీ జె మేయర్ !

Published on Apr 30, 2018 10:23 PM IST

యంగ్ హీరో రామ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. మీ నెల నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మంచి బడ్జెట్ తో పెద్ద స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఎక్కువ భాగం యూరప్లో రూపొందనుందని తెలుస్తోంది.

ఈ యాక్షన్ కమ్ అడ్వెంచర్స్ మూవీకు ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ప్రస్తుతం ‘సావిత్రి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న మిక్కీ త్వరలోనే ప్రవీణ్ సత్తారు చిత్ర పనుల్ని మొదలుపెట్టనున్నారు. పి. కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు, బాలీవుడ్ కు చెందిన దర్శన్ కుమార్, మలయాళ నటుడు సంజు శివరామ్ లు పలు కీలక పాత్రలు పోషించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు