భారీ ఫిగర్ కి “రాధే శ్యామ్” డిజిటల్ రైట్స్.?

Published on Jun 29, 2021 11:04 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” ఫైనల్ టచ్ లో ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం పై ఉన్న అంచనాలు ఏ రేంజ్ లో ఉన్న మరోసారి ప్రూవ్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఇది వరకే ఈ చిత్రంపై డిజిటల్ హక్కుల డీల్స్ క్లోజ్ అయ్యాయని తెలిసింది. ఒక్క హిందీ హక్కులు మినహా మిగతా భాషల హక్కులను జీ సంస్థ వరకు కొనుగోలు చేసారని తెలిసింది. అలాగే హిందీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసారని టాక్. మరి ఇప్పుడు ఈ నాన్ థియేట్రికల్ హక్కులే భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

మొత్తం 250 కోట్లకి రాధే శ్యామ్ నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయట. ఇది ప్రభాస్ తాను నటించిన “సాహో”, “బాహుబలి 2” ల కంటే ఎక్కువ. మరి ఈ క్లాస్ సినిమాకే ఇలా ఉంటే ముందు రానున్న “సలార్”, “ఆదిపురుష్” చిత్రాలు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

సంబంధిత సమాచారం :