టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ విజువల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి హారర్ చిత్రంగా ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తోంది.
ఈ రెండు సినిమాల్లో ‘మిరాయ్’ సూపర్ యోధిడి సినిమాగా ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ అందిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో కేవలం బుక్ మై షో ప్లాట్‌ఫార్మ్‌లో ఈ చిత్రం ఏకంగా 800K కి పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ వీకెండ్‌లో ఈ చిత్రానికి మరింత ఎక్కువ రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.
