సమీక్ష : “మిరల్” – బోర్ గా సాగే థ్రిల్లర్

సమీక్ష : “మిరల్” – బోర్ గా సాగే థ్రిల్లర్

Published on May 18, 2024 3:03 AM IST
Miral Movie Review in Telugu

విడుదల తేదీ : మే 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: భరత్, వాణి భోజన్, కే ఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి

దర్శకుడు: ఎం శక్తివేల్

నిర్మాత: సిహెచ్ సతీష్ కుమార్

సంగీత దర్శకుడు: ప్రసాద్ ఎస్ ఎన్

సినిమాటోగ్రఫీ: సురేష్ బాలా

ఎడిటింగ్: కలైవనన్ ఆర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారంలో కూడా థియేటర్స్ లోకి మరీ చెప్పుకోదగ్గ ప్రముఖ చిత్రాలు రాలేదు. వచ్చిన ఈ కొన్నిటిలో తమిళ్ నుంచి తెలుగులోకి అనువదింపబడిన “మిరల్” కూడా ఒకటి. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ చిత్రం ఒరిజినల్ గా 2022 లో రాగా ఇప్పుడు తెలుగులో ఈ ఏడాదిలో వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. రమా(వాణి భోజన్) కి ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్న తన భర్త హరి(భరత్) విషయంలో ఆమెని కొన్ని పీడకలలు వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రమా తన తల్లి మాట మేరకు తన సొంతూరికి తమ ఆచారాల ప్రకారం కొన్ని పనులు చేస్తే ఇవన్నీ ఆగుతాయనే మాటతో వెళ్తుంది. అయితే ఓరోజు హరి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటాడు. ఈ క్రమంలో వెనక్కి వస్తుండగా వారి కుటుంబానికి గత పదేళ్ల కితం ఓ గ్రామంలో జరిగిన ఘటన తరహాలో మళ్ళీ జరుగుతుంది. అసలు అక్కడేం జరుగుతుంది. హరి ఇంకా తన కుటుంబం మళ్ళీ సేఫ్ గా వెనక్కి తిరిగి వచ్చారా లేదా అనేది మిగతా సారాంశం.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కనిపించిన ప్రేమిస్తే భరత్ తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు అని చెప్పాలి. మెయిన్ గా సెకండాఫ్ లో తనపై కొన్ని సీన్స్ కానీ తన నటన గాని చాలా బావుంది.

ఇంకా నటి వాణి భోజన్ కూడా తనకిచ్చిన రోల్ లో నీట్ గా పూర్తి చేసింది. అలాగే తనతో పాటుగా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇంకా సినిమాలో పలు సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ ప్రధానాకర్షణగా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో థ్రిల్ కలిగించే అంశాలు మరీ అంత ఎక్కువేమీ లేదు. లైన్ ఓకే అనిపిస్తుంది కానీ దానిని తెరకెక్కించిన విధానం మెప్పించదు. అలాగే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మొదటి 15 నిమిషాల్లోనే అర్ధం అయిపోతుంది.

ఇంకా సినిమాని కూడా అనవసరంగా సాగదీతగా బోర్ కొట్టించే సన్నివేశాలతో లాగారు. అలాగే భయానక సన్నివేశాలు ఏమంత గొప్పగా అనిపించవు. ఇంకా ఆల్రెడీ లేట్ సినిమా ఇది అందుకు తగ్గట్టే అన్నట్టుగా తెలుగు డబ్బింగ్ కూడా వరస్ట్ గా అనిపిస్తుంది. చాలా నాసిరకంగా డబ్బింగ్ పనులు పాత్రలకి చేశారు.

ఇవి మరింత చికాకు తెప్పిస్తాయి. అలాగే కె ఎస్ రవికుమార్, మాస్టర్ అంకిత్ సహా ఇతర ప్రధాన పాత్రలు కూడా ఈ సినిమాలో వేస్ట్ అయిపోయాయి. కొన్ని చోట్ల భరత్ రోల్ కూడా అలానే అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఒరిజినల్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం ఏమాత్రం బాగోలేదు. మెయిన్ గా డబ్బింగ్ పరమ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఎస్ ఎన్ ప్రసాద్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే సురేష్ బాల సినిమాటోగ్రఫీ బాగుంది. కలైవనన్ ఎడిటింగ్ పర్లేదు. కొన్ని సీన్స్, సాంగ్స్ తగ్గించాల్సింది. ఇంకా దర్శకుడు ఎమ్ శక్తివేల్ విషయానికి వస్తే.. కథకునిగా దర్శకునిగా కూడా తాను ఈ సినిమాకి విఫలం అయ్యారని చెప్పాలి. అనవసర ట్విస్ట్ లు ఎక్కువ రాసుకున్నారు. పైగా ఆసక్తి లేని కథనం మరింత నీరుగారుస్తుంది. వీటితో సినిమాని మెప్పించే విధంగా ఆవిష్కరించలేకపోయారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టుగా అయితే ఈ “మిరల్” లో మెయిన్ లీడ్, జస్ట్ కొన్ని అంశాలు తప్ప సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా ఏమి లేదు. దర్శకుడు కథనం, దర్శకత్వ వైఫల్యాలు సినిమాని ఆసక్తిగా మలచలేకపోయాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ చికాకు తెప్పిస్తుంది. వీటితో అయితే ఈ సమయం, డబ్బులు వృథా కాకూడదు అంటే ఈ సినిమాకి దూరంగా ఉంటేనే మంచిది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు