ఈ విశ్వసుందరి పంజాబీ సినిమాల్లో నటించింది !

Published on Dec 13, 2021 12:08 pm IST

దాదాపు 21 సంవత్సరాల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకువచ్చింది హర్నాజ్‌ కౌర్‌ సంధు. ప్రస్తుతం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అసలు హర్నాజ్‌ కౌర్‌ సంధు ఎవరు ? ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. హర్నాజ్‌ సంధుకు చిన్నతనం నుంచి మోడలింగ్‌ అంటే బాగా ఇష్టం. ఆ ఆసక్తి కారణంగానే ఆమె నటిగా మారాలని ఎన్నో కలలు కనేది.

అయితే, ఆ కలలను సాకారం చేసుకోవడానికి మోడల్‌ గా మారారు. మోడల్ గా ఎన్నో వేదికలపై మెరిశారు. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని ‘లివా మిస్‌ దివా యూనివర్స్’ కిరీటాన్ని దక్కించుకుని.. విశ్వ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టి.. 80 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేసింది హర్నాజ్‌. అన్నట్టు పంజాబీలో తెరకెక్కిన పలు సినిమాల్లో కూడా నటించింది.

సంబంధిత సమాచారం :