ఇండియాలో సత్తా చాటుతున్న ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’ !
Published on Jul 30, 2018 10:53 am IST

ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కు ఉన్న క్రెజే వేరు. ఇక ఇండియాలో కూడా ఈ సిరీస్ కుచాలా మంది అభిమానులే ఉన్నారు . ఇప్పటివరకు ఈ సిరీస్ లో వచ్చిన 5 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఈ సిరీస్ కు ఆరో సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’ . ఈనెల 27న ఇండియాలో విడుదలైన ఈచిత్రం ఇప్పటివరకు ఇక్కడ అత్యధిక ఓపెనింగ్స్ ను సాధించిన ఆరో హాలీవుడ్ చిత్రం గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తొలి రోజు 9.50 కోట్లు వసూళ్లను సాధించిందని సమాచారం. ఇక ఈ జాబితాలో ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌'(31. 23కోట్లు ) మొదటి స్థానంలో, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7’ ( రూ.12.03) కోట్లతో రెండో స్థానంలో, ‘అవెంజర్స్‌ ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రన్‌’ మూడో స్థానంలో, ‘ది జంగిల్‌బుక్‌’ (రూ.10.12) నాల్గోవ స్థానంలో అలాగే ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8’ (రూ.9.57) ఐదో స్థానంలో ఉన్నాయి.

ఇక హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్ చిత్రాన్ని క్రిస్టోఫర్ మేక్ క్వారీ తెరకెక్కించారు. ఇక ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలలో టామ్ క్రుజే కథానాయకుడు గా నటించడం విశేషం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook