ఫ్యామిలీతో ట్రిప్ కి మార్స్ పైకి వెళదామా…!

Published on Aug 13, 2019 9:49 pm IST

అక్షయ్ కుమార్ హీరోగా డైరెక్టర్ జగన్ శక్తి తెరకెక్కించిన చిత్రం మిషన్ మంగళ్ . భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్స్ గ్రయంపై ప్రయోగించిన మంగళ్ యాన్ సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందింది. మంగళ్ యాన్ మిషన్ హెడ్ గా పనిచేసిన రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ నటిస్తుండగా,ఈ ప్రాజెక్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఐదుగురు లేడీ స్పేస్ సైంటిస్ట్ ల పాత్రలలో విద్యా బాలన్, తాప్సి పన్ను,నిత్యా మీనన్,సోనాక్షి సిన్హా,కీర్తి కొల్హారి నటిస్తున్నారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర విడుదలకు కేవలం ఇంకా రెండు రోజుల వ్యవధే మిగిలివుండటంతో చిత్ర యూనిట్ విరివిగా,వినూత్నంగా ప్రొమోషన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హీరో అక్షయ్ కుమార్ తో పాటు,విద్యా బాలన్, తాప్సి, నిత్యా మీనన్, సోనాక్షి, కీర్తి కొల్హారి మూవీకి హైప్ క్రియేట్ చేయడానికి బాగా కృషి చేస్తున్నారు. “ఈ గురువారం ఫ్యామిలీతో మార్స్ ట్రిప్ కి రండి” అని బోర్డు పట్టుకొని ఈ ఆరుగురు ఉన్న ఓ పోస్టర్ ఆసక్తిగా ఉంది.

ఇటీవల విడుదలైన మిషన్ మంగళ్ ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకోవడంతో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్, హోప్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :