ట్రైలర్ : మిస్టర్ మజ్ను – యూత్ ఫుల్లీ..రొమాంటిక్ గా ఉన్నాడు.

Published on Jan 20, 2019 3:00 am IST

అక్కినేని కుటుంబం నుంచి మరో యువ హీరో అక్కినేని అఖిల్ మరియు నిధి అగర్వాల్ హీరో,హీరోయిన్లుగా “తొలి ప్రేమ” వంటి మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మిస్టర్ మజ్ను” ట్రైలర్ ఈ రోజు రాత్రే విడుదలయ్యింది.ఇక ఈ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే వెంకీ అట్లూరి మరో సారి తనలోని లవ్ మార్క్ ని చూపించారు.కేవలం కొంత కాలం మాత్రమే ప్రేమించే లవర్ బాయ్ గా అఖిల్ ఇంతకు ముంపు చిత్రాల కన్నా మంచి డీసెంట్ గా ఈ సినిమాలో కన్పించబోతున్నట్టు ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.

అందం విషయంలో అక్కినేని ఫామిలీ కోసం చెప్పక్కర్లేదు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అఖిల్ ఫ్రెష్ లుక్ తో అదరగొట్టేసారు.ఈ ట్రైలర్ లో నిధి అగర్వాల్ మరియు అఖిల్ ల మధ్య మాత్రం చక్కటి కెమిస్ట్రీ కుదిరింది.ఇక మిగిలిన అంశాల్లోకి వెళ్లినట్టయతే సినిమా ఒక పక్క లవ్ తో పాటు మరోపక్క డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్నట్టు ట్రైలర్ కనిపిస్తుంది.థమన్ మరోసారి తన మార్క్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు.ఇక చివరిగా చూసుకున్నట్టయితే మెగా బ్రదర్ నాగబాబు,రావు రమేష్ లకు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టు కనిపిస్తుంది..ఓవరాల్ గా ఈ “మిస్టర్ మజ్ను” యూత్ ఫుల్ గా రొమాంటిక్ గా ఆకట్టుకోడానికి రెడీగా ఉన్నట్టున్నాడు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More