ఈరోజు సాయంత్ర జరగనున్న ‘ఎం.ఎల్.ఏ’ ప్రీ రిలీజ్ వేడుక !

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, కాజల్ నటించిన సినిమా ‘ఎం.ఎల్.ఎ’. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనుంది. ఎన్టీఆర్ ఈ వేడుకకు రాబోతున్నాడనే ప్రచారం మొదటి నుండి ఉంది. ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు వస్తే కొత్త లుక్ లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ వేడుకకు ఎన్టీఆర్ వస్తారా ? రారా ? అనే విషయం పై క్లారిటి లేదు. ఎంఎల్ఎ సినిమా విషయానికి వస్తే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నిర్మించబడింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమా మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ నటించిన ‘నా నువ్వే’ వచ్చే మే 25న విడుదలకానుంది.