‘ఎంఎల్ఏ’ మూడు రోజుల వసూళ్ల వివరాలు !

26th, March 2018 - 04:05:33 PM

కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘ఎంఎల్ఏ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.74 కోట్ల గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా రూ. 5.20 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా శని, ఆదివారాల్లో కూడ మంచి జోరు కనబర్చింది. దీంతో ఏపి, తెలంగాణాల్లోమూడు రోజులకు కలిపి రూ.5.93 కోట్ల షేర్ ను ఫ్రపంచవ్యాప్తంగా రూ.7.03 కోట్ల షేర్ ను, రూ.12 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది.

ఏరియాల వారీగా ఈ వసూళ్లను చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్
నైజాం 1.91 కోట్లు
సీడెడ్ 1.19 కోట్లు
ఉత్తరాంధ్ర 65.77 లక్షలు
ఈస్ట్ 56.83 లక్షలు
వెస్ట్ 28.55 లక్షలు
కృష్ణా 44.80 లక్షలు
 గుంటూరు 64.83 లక్షలు
నెల్లూరు 21.51 లక్షలు
కర్ణాటక 50 లక్షలు
యూఎస్ఏ 30 లక్షలు
ఇతరములు 25 లక్షలు
మొత్తం
7.03 కోట్లు