అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన 3వ సినిమా షూటింగ్ కోసం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంత భాగం అక్కడే జరుగనుంది. ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ కొన్ని రిస్కీ బైక్ స్టంట్స్ చేయనున్నారట. ఇందులో కోసం ఆయన ప్రత్యేకమైన బైక్ స్టంట్స్ కూడ నేర్చుకున్నారని తెలుస్తోంది.
అఖిల్ తన గత చిత్రాలైన ‘అఖిల్, హలో’లో కూడ రియల్ యాక్షన్ స్టంట్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే. ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటించనుండగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.


