‘అంతరిక్షం’ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది !

‘అంతరిక్షం’ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది !

Published on Aug 15, 2018 1:00 PM IST

తన మొదటి చిత్రం ఘాజీ’ తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి మరోసారి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు . ‘ఫిదా , తొలిప్రేమ’ చిత్రాల వరుస విజయాలతో జోరు మీదవున్న వరుణ్ తేజ్ తో సంకల్ప్ ఒక స్పేస్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ టైటిల్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా ఫై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తెలుగులో ఈ తరహా జోనర్ లో వస్తున్న మొదటి చిత్రంకావడంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు