కొరటాల శివ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం భరత్ అనే నేను. కలెక్షన్ల బాటలో దూసుకుపోతున్న ఈ సినిమా సినీ అభిమానులు, నిర్మాతల అంచనాలను మించి అంబరాన్నంటుతున్నది. ఇటివల వచ్చిన బాక్సాఫీస్ సమాచారం ప్రకారం భరత్ అనే నేను యూఎస్ లో ప్రస్తుతం 3 మిలియన్ల డాలర్లు గడించిందట. కేవలం నిన్నటి శనివారం రాత్రి 10:30 ని.ల వరకే 133 వేల డాలర్లు వసూలు చేసిందంటే ఆషామాషీ కాదండోయ్. లెక్కేసి కొడితే ఇప్పటివరకు కేవలం ఒవర్సిస్ లోనే 3.029 మిలియన్ల డాలర్లు సంపాదించుకున్న సినిమా భరత్ అనే నేను.
ఇక సినిమాలో సీఎం మహేష్ బాబు విషయానికొస్తే భరత్ అనే నేను సినిమాతో మహేష్ మొట్ట మొదటి సారి 3 మిలియన్ల డాలర్లు స్కోర్ చేసాడు. ఇలా 3 మిలియన్ల డాలర్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలలో భరత్ అనే నేను ప్రస్తుతం నాల్గవ స్థానంలో నిలిచింది. మొదటి, రెండవ స్థానాల్లో బాహుబలి 2, బాహుబలి, నిలువగా రంగస్థలం మూడవ స్థానంలోకి వచ్చింది. ఇక ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి. భరత్ అనే నేను బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం చూస్తూనే ఉండండి మీ 123 తెలుగు.


