ఎన్టీఆర్ బయోపిక్ లో కొత్తవారికి అవకాశం !

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ లో ఏన్నో ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు ప్రముఖ నటులను తీసుకుంటారని అందరూ భావించారు. కానీ చిత్రబృందం ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం అని షాక్ ఇచ్చింది.

ఆసక్తి గలవారికి నిజంగా ఇది గొప్ప అవకాశం. మీరు ఏ వయసు వారైనా సరే మీకు ఆసక్తి ఉంటే ముప్పై సెకన్ల పాటు మీ ముఖకవళికలను మీ సెల్ ఫోన్ లో బంధించి, ఆ వీడియోతో పాటు మీ రెండు ఫోటోలను ఈ మెయిల్ కి (casting.ntrbiopic@gmail.com) పంపండి. ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న ప్రముఖల పాత్రల్లో నటించండి.

Exit mobile version