కుటుంబ సభ్యులందరితో కలిసి చూడతగ్గ సినిమాలు తీయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై స్రవంతి కిషోర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేసారు. ఈ వేడుకకు రామ్, తమన్నా, కరుణాకరన్, స్రవంతి రవికిషోర్, దాసరి నారాయణరావు, రవితేజ, కాజల్ అగర్వాల్, శ్రేయ, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీను వైట్ల, కందిరీగ శ్రీనివాస్, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు విచ్చేసారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తన ఫ్యాన్స్ ఆనందం కోసమే, వాళ్ళకు నచ్చే సినిమాలు చేస్తానని, ఫ్యాన్స్ లేనిదే తను లేనని అన్నాడు. ఈ వేడుకలో సరదాగా జరిగిన కార్యక్రమంలో తమన్నా అంటే తనకు ఎంతో ప్రేమో ఈ సినిమాలో చూడబోతున్నారని అన్నాడు. తమన్నా మాట్లాడుతూ స్రవంతి మూవీస్ సంస్థలో రెడీ సినిమాలో చిన్న పాత్ర పోషించాను. ఆ తరువాత ఈ సంస్థలో ఫుల్ లెంగ్త్ పాత్రలో చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది అన్నారు. ఈ చిత్ర ఆడియోని రవితేజ విడుదల చేసి మొదటి సీడీ అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వేడుకకి విచ్చేసిన అతిధులందరూ ఎందుకంటే ప్రేమంట చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకున్నారు.
తమన్నా అంటే నాకు ప్రేమంట : రామ్
తమన్నా అంటే నాకు ప్రేమంట : రామ్
Published on Apr 29, 2012 10:28 PM IST
సంబంధిత సమాచారం
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- 2027 నుంచి కొత్త రూల్స్: యూట్యూబర్లు డబ్బులు సంపాదించడం ఇక మరింత సవాల్.. పెరిగిన వాచ్ అవర్స్, షార్ట్స్ వ్యూస్ పరిమితి!
- టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


