తెలుగు ఆడియెన్స్ కి ఆగష్టు 15 అలాగే టీవీ స్క్రీన్ పై ‘ఖడ్గం’ సినిమా అనేది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. ముఖ్యంగా 90స్ కిడ్స్ కి అయితే తమ చిన్నప్పుడు ఇలా స్కూల్ నుంచి వచ్చాక స్వాతంత్ర దినోత్సవం నాడు టీవీ పెడితే అందులో ‘ఖడ్గం’ చూస్తే గాని ఆరోజు పూర్తి కాదు.
అయితే ఇన్నాళ్లు ఆగష్టు 15కి కేవలం బుల్లితెరపైనే అలరించిన ఈ చిత్రం ఈసారి మాత్రం బిగ్ స్క్రీన్స్ పై బిగ్ సౌండ్ తో ఎంజాయ్ చెయ్యాలని దర్శకుడు కృష్ణవంశీ ఖడ్గం రీరిలీజ్ ని ఖరారు చేశారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సెట్ చేసింది.
మరి ఈసారి రీరిలీజ్ కి ఎలాంటి ప్లానింగ్ లేకుండానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్ అందించగా ఆగష్టు 15నే ఈ చిత్రం అలరించనుంది.


