కన్నడ రాకింగ్ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. భారీ హైప్ ఉన్న ఈ ఇండో కన్నడ సినిమాని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఇలా ఎంతో కాలం వాయిదాల తర్వాత ఎట్టకేలకి థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతుండగా కొన్నాళ్ల కితమే టాక్సిక్ సినిమా వరల్డ్ వైడ్ గా ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ ఉంటుంది అని బజ్ వినిపించింది.
అయితే ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా దీనిపై ప్రకటన ఇచ్చారు. ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టాక్సిక్ గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయినట్టు మేకర్స్ యష్ పై ఓ సాలిడ్ పోస్టర్ ని విడుదల చేసి ఖరారు చేశారు. ఇక ఈ వెర్షన్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా అలాగే నయనతార తదితరులు నటించగా యష్, కే వెంకట నారాయణ సంయుక్తంగా నిర్మాణం వహించారు.


