ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఫేవరేట్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి అని చెప్పాలి. అనీల్ రావిపూడి తెలుగులో సంక్రాంతి కానుకగా సినిమాలు అందిస్తూ ఒకదాన్ని మించి ఒక బ్లాక్ బస్టర్ ని కొడుతూ వచ్చారు. ఇలా నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఓ సినిమాని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈసారి ఒక ఊహించని కాంబినేషన్ అని గట్టి టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అయితే కొందరు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా వీరి కలయికలో సినిమాని నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తారు అంటూ వినిపిస్తోంది. మరి నిజంగా ఈ కాంబినేషన్ ఉంటుందా లేక అనీల్ పూర్తిగా కొత్త కాంబినేషన్ తో వస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే అంతా మన శంకర వరప్రసాద్ గారు మేనియాలో ఉన్నారు.


